ఇండోనేషియా పశ్చిమ సుమత్రా ప్రావిన్స్ తీరంలో మంగళవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఇండోనేషియాకు చెందిన మెట్రోలాజికల్, క్లైమాటాలజీ, జియోఫిజికల్ ఏజెన్సీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రకటన చేసింది. 100 కిలోమీటర్ల (62.14 మైళ్ళు) దూరంలో... 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చింది అని ప్రకటించింది. అయితే సునామీ హెచ్చరికలు లేవు అని ప్రకటన చేసింది.

యూరోపియన్- మధ్యధరాను భూకంప కేంద్రంగా గుర్తించారు. 6.2 నుండి 5.8 కి వరకు భూకంపం వచ్చింది అని వెల్లడించింది. ఇక సునామి హెచ్చరికలు లేకపోయినా సరే ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది.  దీనితో కొందరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భూకంపాలు, సునామీలకు ఆ దేశం పెట్టింది పేరు. భూకంప తీవ్రత నష్టాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆస్తి ప్రాణ నష్టం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: