భాజపా 41వ స్థాపనా దివస్‌ సందర్భంగా ప్రధాని మోదీ భాజపా కార్యకర్తలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం లో అస్థిరత్వం సృష్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని విమర్శించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, సీఏఏ, కార్మిక చట్టాలపై ఇటువంటి తప్పుడు ప్రచారాలు అధికంగా వ్యాపించయని అన్నారు.  ఇలాంటి అసత్య ప్రచారాల వెనుక ఉద్దేశపూర్వక రాజకీయాలు ఉన్నాయని.. ఇదో పెద్ద కుట్ర అని స్పష్టంచేశారు. దేశంలో అపోహలు, భయాలను రేకెత్తించడం ద్వారా రాజకీయ అస్థిరతను సృష్టించడమే వీటి ఉద్దేశమని.. ఇది మనకు తీవ్రమైన సవాల్‌ అని భాజపా కార్యకర్తలకు వివరించారు.

ఈ నేపథ్యంలో భాజపా కార్యకార్తలు ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు.ఇక దేశంలో ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తోన్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశిస్తూ.. కొందరు ఈవీఎంలను భాజపా ఎన్నికల గెలుపు మెషిన్‌గా పేర్కొంటుండడంపైనా మోదీ మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీలు, వారి నాయకులు గెలిచినప్పుడు మాత్రం ఇవే ఈవీఎంలను కీర్తిస్తారని, ఇలాంటి పార్టీలు, నాయకులు భారత ప్రజల పరిపక్వతను, ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోలేరని దుయ్యబట్టారు. బెంగాల్ సి‌ఎం మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..వ్యంగ్యస్త్రాలు సంధించారు. " నందీ గ్రామ్ లో ఆమె కోపం ప్రదర్శించినప్పుడే ఆమె ఓడిపోతారని దేశం గ్రహించిందని ప్రధాని అన్నారు. మీరేమైనా దేవుడా అని ప్రశ్నిస్తున్నారు..మేము ప్రజలకు సేవ చేసే సాధారణ మనుషులమని ఆయన పేర్కొన్నారు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: