ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అల్లాడిపోతున్న దేశాన్ని మరోవైపు బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న రోగులకు సోకుతూ ప్రాణాంతకంగా మారుతోంది.  కరోనా వచ్చిందన్న కంగారులో..ఏదో ఒక మందు వాడటం సరైంది కాదు.  కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల తలెత్తే మ్యూకర్మైకోసిస్ వ్యాధినే బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. దీనిబారినపడితే కళ్లు ఎర్రబారి చూపుకోల్పోవడంతోపాటు అవయవాలు పనిచేయడం మానేసి మృత్యువాతపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినట్లు కనిపించినా, మరో ప్రాణాంతక వ్యాధి బ్లాక్ ఫంగస్ పడగవిప్పుతోంది. కరోనా కొందరు చనిపోతుంటే.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ మరణాలు సైతం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా తగ్గిన తర్వాత కూడా ఇన్‌ఫెక్షన్లు వెంటాడుతున్నాయి.  నిజామాబాద్‌ జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి లక్షణాలతో ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. నవీపేట మండలం రాంపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐకే ఫారానికి చెందిన బెజవాడ హరిబాబు (35), బోధన్‌లోని శక్కర్‌నగర్‌కు చెందిన మర్రి రాజేశ్వర్‌ (39), వేల్పూరు మండలం సాహెబ్‌పేట గ్రామానికి చెందిన ఉట్నూర్‌ చిన్న గంగారాం (65) హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు.నిజామాబాద్‌ రూరల్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు సరస్వతినగర్‌లో స్కానింగ్‌ చేయడంతో ఈ లక్షణాలు కనిపించాయి. ముక్కు వద్ద ఇన్‌ఫెక్షన్‌ ఉండడం, నల్లటి చారలు కనిపించడంతో డాక్టర్‌ హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతుంటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: