హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటెల రాజేంద్రకు త్వరలో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం లోని అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలలో   ప్రభుత్వ పట్టాలు ఇచ్చిన అసైన్డ్ భూమిని సర్వే కొరకు   16, 17, 18 తేదీలలో   హైకోర్టు  ఆదేశాలతో సర్వేని మొదలు పెట్టారు.

ఈటెల  రాజేంద్ర కుటుంబానికి సంబంధించిన జమున హైచరిస్ సంస్థకు నోటీసులు జారీ చేసారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే . ఈ రోజు అచ్చంపేట లోని సర్వే నం. 130 లో 18.20 ఎకరాల అసైన్డ్ భూమి 11 మంది రైతులకు నోటీస్ లు ఇచ్చామని తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ పేర్కొన్నారు. ఈ సర్వే నం. లొనే జమున పౌల్ట్రీ నిర్మాణం జరిగిందని సర్వే చేసి విచారణ చేసే అవకాశం ఉంది.దీనిపై ఈటెల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో చూడలి.

మరింత సమాచారం తెలుసుకోండి: