తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపినది. త్రివిధదళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణం దురదృష్టకరం అని.. రక్షణ శాఖ కార్యదర్శి, భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి. జనరల్ రావత్ సుమారు 209 రక్షణ పరికరాలను స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించాలని ఒక జాబితాను కూడా సిద్ధం చేసారు. త్రివిధ దళాలను సంఘటితం చేసి మరింత పటిష్టంగా రక్షణ దళ వ్యవస్థను సాంకేతికంగా అభివృధ్ది చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని పేర్కొన్నారు డా. సతీష్‌రెడ్డి.
ఆదిశగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థతో నిరంతరం చర్చలను బిపిన్ రావత్ జరిపే వారని పేర్కొన్నారు. చాలా వరకు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు పురోగతి సాధించామని వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో స్వావలంబన సాధించాలని బిపిన్ రావత్ నిత్యం పరితపించేవారని, జనరల్ బిపిన్ రావత్ తో నాకు 2016 నుంచి బాగా సాన్నిహిత్యం ఉన్నదని, ఆయన లేని లోటు తీర్చలేనిది అని తెలిపారు సతీష్‌రెడ్డి.
మరింత సమాచారం తెలుసుకోండి: