ఢిల్లీలో కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్‌ శ్మ‌శాన వాటిక‌లో భార‌త మాత ముద్దుబిడ్డ‌,  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అంత‌కుముందు భ‌రత భూమి పుత్రుడు రావ‌త్ అమ‌ర్ ర‌హే.. ఇండియ‌న్ ఆర్మీ జిందాబాద్‌.. వందేమాత‌రం అంటూ  ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి అంతిమ యాత్ర‌గా బ‌య‌లుదేరింది.  కొంద‌రు యువ‌త జాతీయ జెండాల‌ను చేతుల్లో ప‌ట్టుకుని  అంతిమ యాత్ర‌లో భార‌త్ మాతాకి జై అని.. అంతిమ యాత్ర  వాహ‌నం ముందు ప‌రుగులు పెడుతుంటే.. అంద‌రినీ కంట‌త‌డి పెట్టించిన‌ది.

అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్న సంద‌ర్భంలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు ఆర్మీ అధికారులు, కేంద్ర‌మంత్రులు, ప‌లువురు ప్ర‌ముఖులు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించి చివ‌రిసారిగా నివాళుల‌ను అర్పించారు.  బ్రార్ స్క్వేర్‌ శ్మ‌శాన వాటిక వ‌ద్ద చివ‌రిసారిగా ప‌లువురు ఆర్మీ అధికారులు, ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు.  బిపిన్ రావ‌త్ మృతి ప‌ట్ల  ప్ర‌తీ ఒక్క‌రూ కంట‌త‌డి పెట్టారు.  ముఖ్యంగా రావ‌త్ కుటుంబ స‌భ్యుల రోధ‌న‌లు మిన్నంటాయి. వారు చివ‌రి సారిగా నివాళుల‌ర్పించిన త‌రువాత..  సైనిక అధికారిక‌ లాంఛ‌నాల‌తో రావ‌త్ దంప‌తుల అంత్య‌క్రియ‌లను నిర్వ‌హించారు.

 అంత్య‌క్రియ‌ల‌కు శ్రీ‌లంక‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్ దేశాల సైనిక అధికారులు హాజ‌ర‌య్యారు. అంత్య‌క్రియ‌ల్లో దాదాపు 800 మంది సైనికులు పాల్గొన్నారు. బిపిన్ రావ‌త్ దంప‌తుల‌కు కూతుర్లు కృతిక‌, త‌రుణి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.  17  తుపాకుల‌తో బిపిన్ రావ‌త్‌కు వంద‌నం చేసారు. జాతీయ జెండాను రావ‌త్‌కు క‌ప్పారు.  క‌ప్పిన జెండాను కుటుంబ స‌భ్యుల‌కు అందించారు. త‌ల్లిదండ్రులు లేని లోటు.. జెండా ద్వారా త‌ల్లిదండ్రుల‌ను గుర్తు చేసుకోవ‌చ్చ‌ని గుర్తుగా అంద‌జేస్తారు.  అయితే అంతిమ‌యాత్ర దారి పొడ‌వునా.. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో భార‌త్‌మాతాకి జై.. బిపిన్ రావ‌త్ అమ‌ర్ హై.. వందేమాత‌రం అనే నినాదాలు బ్రార్ స్క్వేర్‌ శ్మ‌శాన వాటిక ప్రాంగ‌ణ‌మంతా నినాదాల‌తో నిండిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: