ఏపీ సీఎం జగన్‌ను కొందరు ముస్లిం మైనారిటీ నేతలు కలిశారు. శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వైయ‌స్‌ జగన్‌ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ మయాన జకియా ఖానం, ముస్లిం ఎమ్మెల్సీలు తదితరులు మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిసి కొద్ధిసేపు మాట్లాడారు. ఉర్ధూ బాషను సెకండ్‌ లాంగ్వేజ్‌గా ప్రకటించాలని.. మైనార్టీల అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా సబ్‌ప్లాన్‌ను ది మైనారిటీ కాంపొనెంట్‌గా మారుస్తూ శాసనమండలిలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంది. ఈ విషయం గురించి సీఎంకు వివరించేందుకు మైనారిటీ నేతలు ఉంటే మంచిదని భావించారు. సీఎం నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ముస్లిం నేతలు.. తాను అందరి వాడిని అన్నారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మండ‌లి డిప్యూటీ చైర్మన్ జ‌కియా ఖానం, ఎమ్మెల్సీలు షేక్‌ మహ్మద్‌ ఇక్భాల్, ఇసాక్‌ బాషా, ఎం.డి.రుహుల్లా కలిశారు. వీరంతా పుష్పగుచ్ఛం అంద‌జేసి సీఎంకు ధ‌న్యవాదాలు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: