కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభలోని తమ సభ్యులందరికీ విప్‌ జారీ చేసేసింది. పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందడం కోసం ఈ విప్ జారీ చేసింది. దీని ప్రకారం..  మంగళవారం నుంచి శుక్రవారం వరకు సభ్యులంతా సభకు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లను విలీనంచేస్తూ తీసుకువచ్చిన చట్టంతో పాటు అనేక కీలక బిల్లులు ఆమోదం కోసం సిద్ధంగా ఉన్నాయి. అసలే రాజ్యసభలో బీజేపీకి ఇంకా పూర్తి మెజారిటీ లేదు. అందుకే విప్ జారీ చేసింది.


ఇంకా నేర దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించేందుకు తీసుకువచ్చిన క్రిమినల్ ప్రొసీజర్‌ బిల్లు కూడా రాజ్యసభలో చర్చకు రాబోతోంది. బీజేపీకి రాజ్యసభలో తగినంత బలం లేకపోయినప్పటికీ ప్రాంతీయపార్టీల మద్దతుతో పలు బిల్లులను ఆమోదించింది. ఇప్పుడు రాజ్యసభలోనూ అదే వ్యూహం అనుసరించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp