ఓ సినిమాలో ఎస్వీ రంగారావు.. అనగనగా ఓ రాజు.. అనగనగా ఓ రాణి అని ఓ పాట పాడతారు.. అందులో రాజుకు నలుగురు కొడుకులు ఉంటారని.. కానీ వారు వార్థక్యంలో రాజును చూసుకోరని.. రాజు పెంచుకున్న కుక్కే విశ్వాసంగా ఉంటుందని చెబుతారు. పెంపుడు జంతువుల విశ్వాసాన్ని చెప్పే పాట అది. ఇప్పుడు అలాంటి పెంపు జంతువుకు ఓ వ్యక్తి ఏకంగా గుడి కట్టించిన ఘటన ఆసక్తి రేపుతోంది. పెంచుకునే కుక్కకు గుడి కట్టించిన సంఘటన తమిళనాడులో జరిగింది. శివగంగ జిల్లాలోని మనమదురైకి చెందిన ముత్తు అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల చనిపోయిన తన కుక్క కోసం గుడి కట్టాడు. ప్రేమగా పెంచుకున్న కుక్క మరణాన్ని తట్టుకోలేక.. దాని జ్ఞాపకం కోసం ఈ గుడి కట్టాడు. 82 సంవత్సరాల ఈ ముత్తు తన కుక్క టామ్‌కు దాదాపు 80 వేలు ఖర్చు చేసి  పాలరాతి విగ్రహాం చేయించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: