ఉపాధ్యాయ సంఘాలు చలో సీఎంవో కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో ప్రభుత్వం దాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి సీఎం క్యాంపాఫీసుకు వెళ్లే అన్ని దారులు మూసివేసింది. సీఎం క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసుల దారికి అడ్డంగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. క్యాంపు  కార్యాలయం మార్గంలో నివాసం ఉండే స్థానికులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


అనేక చోట్ల పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు. పిల్లలను పాఠశాలకు పంపేందుకూ దారి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని పోలీసులు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంటే.. ఎలాగైనా విజయవంతం చేయాలని ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు.


ఇప్పటికే యూటీఎఫ్‌ సభకు వెళ్లొద్దంటూ ఉపాధ్యాయ నేతలకు నోటీసులు వెళ్లాయి. చాలా మంది యూటీఎఫ్‌ నేతలను స్టేషన్‌కు పిలిపించి సభకు వెళ్లకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను గృహ నిర్బంధం చేశారు. ఉపాధ్యాయులు, యూటీఎఫ్‌ నేతల ఇళ్లపై ఓ కన్నేసి ఉంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: