కరోనా పుట్టిల్లు చైనా మరోసారి కరోనా భయంతో వణికిపోతోంది. ఇప్పటికే చైనాలోని అనేక నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జీరో కరోనా టార్గెట్‌ పెట్టుకున్న చైనాకు దాన్ని సాధ్యం చేయడం కుదరడం లేదు. ఇప్పటికే  కొన్ని వారాలుగా చైనా వాణిజ్య రాజధాని షాంఘైను కరోనా వణికిస్తోంది. ఇక ఇప్పుడు అదే కరోనా వైరస్ రాజధాని బీజింగ్ లోనూ విజృంభిస్తోంది. ఇప్పటికే షాంఘైలో 5 లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు బీజింగ్ లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా బీజింగ్ లో 34 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.


దీంతో కంగారు పడుతున్న చైనా.. బీజింగ్ వాసులందరికీ కొవిడ్ పరీక్షలను నిర్వహిస్తోంది. అంతే కాదు.. షాంఘై తరహాలో ఇక్కడ కూడా లాక్ డౌన్ విధిస్తారన్న భయంతో బీజింగ్ వాసులు భారీగా నిత్యావసర వస్తువులు నిల్వ  చేసుకుంటున్నారు. దీంతో సరుకుల కొరత వచ్చేస్తోంది. కానీ బీజింగ్ లో లాక్ డౌన్ విధింపుపై ఇంకా అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ప్రస్తుతానికి కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: