కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత కాశ్మీర్ పండిట్ల వివరాలు బాగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ నివేదిక వెలుగు చూసింది. దీని ప్రకారం 1990లో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల దాదాపు 65వేల కాశ్మీర్‌ పండిట్ల కుటుంబాలు కాశ్మీర్‌ లోయను వీడినట్లు కేంద్రం చెబుతోంది. వారంతా జమ్ము, దిల్లీ, దేశంలోని ఇతరప్రాంతాల్లో స్థిరపడ్డారట. సిక్కులు, కొన్నిముస్లిం కుటుంబాలు కూడా కాశ్మీర్‌ లోయ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారట. దాదాపు 1054కుటుంబాలు జమ్ము కొండప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లినట్లు కేంద్రం లెక్కలు చెబుతోంది. కాశ్మీర్‌కు చెందిన 43వేల 618 కుటుంబాలు జమ్ములో స్థిరపడ్డారడట. మరో 19వేల 338 కుటుంబాలు దిల్లీలో స్థిరపడ్డారట. అలాగే జాతీయ రాజధాని ప్రాంతంలో 1995 కుటుంబాలు స్థిరపడ్డాయట. 2014 నుంచి 2020 వరకు కాశ్మీర్‌ లోయలో 2వేల 546 ఉగ్రదాడులు జరిగినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ దాడుల్లో  481 భద్రతా సిబ్బంది, 215మంది పౌరులు చనిపోయారట. అలాగే 1216మంది ఉగ్రవాదులు హతమయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి: