నిత్యావసరాల కోసం మార్కెట్‌కు వెళ్తే ధరలు మండిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉంటున్నాయి. పెట్రో ధరలు, మార్కెట్‌లో లభ్యత వంటి అసలైన కారణాలతో పాటు దళారుల దురాశ కూడా ధరల పెరుగుదలకు కారణం. అందుకే ఈ అడ్డగోలు ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ఓ యాప్‌ అందుబాటులోకి తీసుకురాబోతోంది. సియం యాప్-సిపిఏ అంటే కన్సూమర్ ప్రైస్ అప్లికేషన్ పేరిట ప్రత్యేక యాప్ రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లు, స్థానిక మార్కెట్లలో కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణకు త్వరలో ఈ ప్రత్యేక యాప్ అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ వెల్లడించారు. సచివాలయంలో ధరల స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన  నిత్యావసర సరుకుల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సియం యాప్ కన్సూమర్ ప్రైస్ అప్లికేషన్ పేరిట ప్రత్యేక యాప్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: