తిరుపతిలో చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకోసం ఓ ప్రణాళిక రూపొందించింది. చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ ప్రత్యేకంగా విరాళాల స్వీకరించాలని నిర్ణయించింది. సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ఆన్‌ లైన్‌లో నైనా ఆఫ్‌ లైన్‌లోనైనా విరాళాలు పంపొచ్చని తెలిపింది. ఇప్పటికే ఫిబ్రవ‌రి 16 నుంచి ఆన్‌లైన్ ద్వారా టీటీడీ విరాళాలు స్వీక‌రిస్తోంది. ఇక ఇప్పుడు భ‌క్తుల విజ్ఞప్తితో ఆఫ్‌లైన్‌లోనూ విరాళాలు స్వీక‌రించాల‌ని టీటీడీ నిర్ణయించింది.

మరి విరాళాలు ఎలా అందజేయాలా అనుకుంటున్నారా.. ఈవో, టీటీడీ పేరిట డీడీగానీ, చెక్కుకానీ రాసి.. విరాళంగా ఇవ్వవచ్చు. కోటి రూపాయలు లేదా అంతకు మించి విరాళం ఇచ్చే దాత‌ల‌కు ఉద‌యాస్తమాన సేవా టికెట్లను టీటీడీ కేటాయిస్తోంది. మరిన్ని వివరాల కోసం భక్తులు సంప్రదించాల్సిన నంబర్ 0877-2263589గా టీటీడీ ప్రకటించింది. ఓ మంచి కార్యకోసం టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయంగా చెప్పుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: