రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారత 15వ రాష్ట్రపతిగా ఆమె ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ముర్ము 21 గన్‌ సెల్యూట్‌ స్వీకరిస్తారు. అనంతరం కొత్త రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది.

ఈ నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల అధిపతులు, పార్లమెంటు సభ్యులు, త్రివిధ దళాల అధికారులు హాజరవుతారు. ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త రాష్ట్రపతితో పాటు రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపతి ముర్ము గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరిస్తారు. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన తొలి తెలుగు వ్యక్తిగా జస్టిస్‌ రమణ ఖ్యాతి గడించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: