దేశంలో ప్రధాని పదవికి పోటీ పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఈ రేసులో ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ కూడా దేశవ్యాప్తంగా కూటమి కట్టే ఆలోచన చేశారు. ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా జాతీయ స్థాయిలో విస్తరించాలని చూస్తున్నారు. ఇక ఇప్పుడు మరో నాయకుడి పేరు ప్రధాని పదవికి పోటీలో వినిపిస్తోంది. ఆయనే బీహార్ సీఎం  నితీష్‌ కుమార్‌.  

విపక్షాలన్నీ అంగీకరిస్తే ప్రధాని పదవికి నితీశ్‌ కుమార్‌ బలమైన అభ్యర్థిగా నిలుస్తారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అంటున్నారు. బీహార్‌లో మహాఘట్‌బంధన్‌ సర్కారుకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని తేజస్వీ అంటున్నారు. ఇటీవల భారతీయ జనతా పార్టీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్‌ కుమార్‌...ఆర్జేడీతో కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త సర్కారులో తేజస్వీ యాదవ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pm