ఒక్కో దేశంలో రాజ్యాంగం ఒక్కోలా ఉంటుంది. మన దేశంలో ప్రధానిగా ఓ వ్యక్తి ఎంత కాలమైనా పరిపాలించొచ్చు. అమెరికాలో గరిష్టంగా రెండు సార్లు మాత్రమే ప్రధానిగా పని చేసే అవకాశం ఉంది. థాయ్‌లాండ్‌లోనూ ప్రధాని పదవి విషయంలో ఆంక్షలు ఉన్నాయి. ఓ వ్యక్తి గరిష్టంగా 8 ఏళ్లకు మించి ఆ పదవిలో ఉండే అవకాశం లేదు.

తాజాగా అలాగే జరిగింది.. థాయ్‌లాండ్‌లో ప్రధాని ప్రయూత్  ఛాన్  ఓచాను ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం పదవి నుంచి తప్పించింది. ప్రయూత్ ఎనిమిదేళ్లకు మించి పదవిలో కొనసాగుతున్నారని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఆయనను పదవి నుంచి తప్పించింది. తుది తీర్పు వచ్చేవరకు ఎలాంటి విధులు నిర్వర్తించరాదని ఆదేశించింది. ప్రస్తుతం డిప్యూటీ ప్రధాని, ప్రయూత్ కు అత్యంత సన్నిహితుడైన ప్రవీత్  వాంగ్ సువాన్ ఇన్ చార్జి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: