తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై ఇక ప్రియాంకా గాంధీ ఫోకస్ పెంచబోతున్నారా.. ఇక తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలను ప్రియాంకా గాంధీ శాసించబోతున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది. నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చెప్పిన విషయాలను బట్టి చూస్తే ప్రియాంకా గాంధీ తెలంగాణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తామన్న రేవంత్ రెడ్డి.. ప్రియాంక గాంధీ తెలంగాణ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారని చెప్పారు.


ఇకపై తెలంగాణకు ప్రియాంకా గాంధీ పూర్తి స్థాయిలో సమయం ఇస్తానని చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో తన బంధువులపై వచ్చి ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఏ స్కాంలోనైనా నా సొంత సోదరుడు ఉన్నా ఉరి తీయండని రేవంత్ రెడ్డి అన్నారు. సంస్థలు అన్ని మీవే కదా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలిసిన వారు ఎవరు స్కాం లో ఉన్న దానికి నాకు సంబంధం ఉంటుందా అని ప్రశ్నించారు. చుట్టాలు ఉంటే భాగస్వాములం అవుతమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: