వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకోవడం మామూలే. అయితే.. ఈ ఏడాది జగన్ సర్కారు అనేక కొత్త నిబంధనలు పెడుతూ ఇబ్బంది పెడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రూల్స్ పెడుతూ పండుగ జరపడం అంటే  అర్ధమేమిటని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. వినాయక ఉత్సవాలు ఎలా జరపాలో హైదరాబాద్ ఉత్సవాలు చూసి ముఖ్యమంత్రి  నేర్చుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు.


ఎటువంటి అనుమతులు లేకుండా తాను ఉత్సవాలు నిర్వహిస్తానని..., దమ్ముంటే అరెస్టు చేయాలని సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. వినాయక ఉత్సవ కమిటీలను ప్రభుత్వం అడ్డుకుంటే బీజేపీకి సమాచారం ఇవ్వాలని వీర్రాజు అంటున్నారు. వారికి బిజెపి అండగా ఉంటుందని సోము భరోసా ఇచ్చారు. ఫైర్, విద్యుత్, పోలీసు పర్మిషన్ల పేరుతో వినాయక నవరాత్రులు దగ్గర పడేంతవరకు కాలయాపన చేసి ఉత్సవాలు పరోక్షంగా నిరోధించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం కొత్త నిబంధనలేమీ లేవని చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: