ఒక దేశానికి ఎన్ని రాజధానులు ఉంటాయి.. సాధారణంగా ఒక్కటే ఉంటుంది. కొన్ని చోట్ల కాలాన్ని బట్టి రెండు రాజధానులు ఉంటాయి. శీతాకాలంలో ఒకటి, ఎండా కాలంలో ఒకటి. అయితే.. దేశానికి ఒకటి కంటే ఎక్కువ రాజధానులుండాలన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇండియాకు హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలని అంబేడ్కర్ అనేవారు. అయితే.. ఇప్పుడు ఏకంగా దేశానికి ఐదు రాజధానులు ఉండాలంటున్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.


దేశంలోని ప్రతి జోనుకు ఒకటి చొప్పున.. ఐదు రాజధానులు అవసరం అంటున్నారాయన. దిల్లీ ముఖ్యమంత్రితో చేస్తున్న మాటల యుద్ధంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌కు పక్క రాష్ట్రాలను ఎగతాళి చేసే అలవాటు ఉందంటున్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. అలా జరగకుండా ఉండటానికి దేశానికి ఐదు రాజధానులు ఉంటే.. ఎలా ఉంటుందంటూ సోషల్ మీడియాలో స్పందించారు. ఐదు రాజధానులు చేస్తే దిల్లీ లాంటి ప్రభుత్వాల వద్ద ఎక్కువ సంపద కేంద్రీకృతం కాకుండా ఉంటుందని కొత్త వాదన తెచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: