పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఆలస్యమైందని ఆర్ధిక మంత్రి బుగ్గన కామెంట్ చేశారు. కాపర్ డ్యామ్ లో గ్యాప్ లు వదిలేయటం వల్లే డయాఫ్రాం వాల్ దెబ్బతిందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ఆ గోతులు పూడ్చేందుకు సమయం పడుతోందని అందుకే ప్రాజెక్టు ఆలస్యమవుతోందని మంత్రి బుగ్గన అన్నారు.


ప్రస్తుత రేట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోడానికి సమయం పడుతోందని మంత్రి బుగ్గన  వ్యాఖ్యానించారు. టీడీపీ పాత రేట్లతోనే ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నించటం వల్లే నిర్మాణం ఆలస్యమైనట్టు మంత్రి బుగ్గన అన్నారు. గత ప్రభుత్వ హాయంలోనే ఎక్కువ అప్పులు చేశారని మంత్రి బుగ్గన  అన్నారు. మాజీ ఆర్ధిక మంత్రి యనమల పెద్ద అప్పుల మంత్రి అయితే చంద్రబాబు అబద్ధాల నాయుడని మంత్రి బుగ్గన  ఆక్షేపించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలనే రాయలసీమ ప్రాంత వాసులు కోరుతున్నారని మంత్రి బుగ్గన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: