తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఓ వ్యాపార కేంద్రంలా నిర్వహిస్తున్నారని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపిస్తునత్నారు. శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చిన వీరంతా.. టీటీడీ నిర్వహణపై మండిపడ్డారు. తమను మహద్వారం నుంచి దర్శనానికి పంపమని వీరు కోరితే.. తమకు సమాచారం లేదని భద్రతా సిబ్బంది చెప్పడం వారికి కోపం తెప్పించింది. ముందుగా లేఖ ద్వారా తెలియజేసినా ఇలా చేస్తారా అని నిరసన తెలిపారు.


తిరుమలలో రాజకీయ నేతలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతోందని స్వాములు ధ్వజమెత్తారు. అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని స్వాములు స్పష్టం చేశారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశంలోని 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో కొత్త పార్టీ పెడతామన్నారు. తిరుమలలో సామాన్యులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: