ఏపీలో ఉపాధ్యాయులు మరోసారి నిరసన బాట పడుతున్నారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతున్నామని.. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు తెలిపారు. ఉపాద్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు .. ఉపాధ్యాయులు దాచున్న డబ్బులను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని విమర్శించారు.


తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు .. ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసనకు వెళ్లకుండా పోలీసులు భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అటంకాలు పెట్టినా శాంతియుతంగా మా బాధను ప్రభుత్వానికి తెలియ చేస్తామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు  తెలిపారు. ఇకైనానా సర్కారు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: