తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. అందుకు తగిన కార్యాచరణను రెడీ చేసుకుంటోంది. వచ్చే పది మాసాలకు ఎన్నికల క్యాలండర్ ను బీజేపీ సిద్ధం చేసింది. అందులో భాగంగా.. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు గ్రామ స్థాయిలో పది వేల వీధి సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అలాగే ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఫిబ్రవరిలో కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో మేధావులతో సమావేశాలు నిర్వహిస్తారు.


ఇక మార్చి మాసంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రజలను చైతన్యం చేయడానికి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ లో  భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. దీనిలో అమిత్ షా లేదా నడ్డా చేతుల మీదుగా ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. మార్చిలోపు పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమాలు ముగించుకొని పార్లమెంట్ స్థాయిలో సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: