తిరుమలలో గదుల ధరల పెంపు విషయంలో రాజకీయం చేయడం చాలా బాధాకరమని ఈవో ధర్మారెడ్డి అంటున్నారు. తిరుమలలో మొత్తం 7500 గదులు,నాలుగు యాత్రిక సదన్ లు ఉన్నాయని.. రూ 50, రూ. 100 గదులు 5 వేలు ఉన్నాయని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ ధరలు 40 సంవత్సరాల క్రితం నిర్ణయించిందని.. తిరుమలలో రూ. 120 కోట్ల పలు గదులను ఆధునీకరించామని.. రూ. 50, రూ. 100 గదులల్లో ఫ్లోరింగ్,గ్రీజర్లు వంటివి కల్పించామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


పద్మావతీ,ఎంబిసి కార్యాలయాల్లో  ప్రముఖులకు ఇచ్చే గదులు ఉంటాయన్న ఈవో ధర్మారెడ్డి .. నారాయణగిరి, ఎస్వీ అతిధి గృహం, స్పెషల్ టైప్ అతిధి గృహాలు వీఐపీ కోటా కింద ఉన్న గదులని తెలిపారు. ఎంబిసి కార్యాలయం కింద ఉన్న ఈ మూడు అతిధి గృహాలకు సంబంధించి గదుల ధరలను పెంచామనన్న ఈవో ధర్మారెడ్డి .. పద్మావతీ, ఎం.బి.సి కార్యాలయాలకు సంబంధించి వ్యత్యాసం లేకుండా చేయాలని పెంచామన్నారు. రూ. 8 కోట్ల వ్యయంతో ఈ అతిధి గృహాలను ఆధునీకీకరించామని.. 170 గదులను పూర్తిగా మరమ్మత్తులు చేసి వ్యత్యాసం లేకుండా ధరలు పెంచామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మిగతా రూ. 50, రూ. 100 గదుల ధరలు పెంచే ఆలోచన లేదని.. మరమ్మతులు చేసిన గదులకు ఐదు లక్షలు ఖర్చు చేశామని ఈవో ధర్మారెడ్డి  వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: