గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సం సందర్భంగా ఆ పార్టీ నేతలు మంగళగిరి ప్రీమియం లీగ్ పేరుతో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈనెల 13 నుంచి 23 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా 48 టీమ్ లు క్రికెట్ టోర్నీలో పాల్గొంటున్నాయి.


మొదటి బహుమతి సాధించిన వారికి లక్షరూపాయలు, రెండో బహుమతి టీమ్ కు 50వేలు, మూడో స్థానంలో నిలిచే జట్టుకు 25వేలు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించే వారికి 2వేలు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్  సాధించే వ్యక్తికి 10వేల నగదు బహుమతులు ఇవ్వనున్నారు. ఈనెల 23న నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ఫైనల్ పోటీలో ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ బహుమతులు ప్రదానం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: