నందమూరి బాలకృష్ణ దేవ బ్రాహ్మణ కులస్తులకు క్షమాపణలు చెప్పారు.  దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీనిపై  దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన నందమూరి బాలకృష్ణ.. దేవ బ్రాహ్మణులకు క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.  సోదరసోదరీమణులకు మీ సోదరుడు బాలకృష్ణ అంటూ ఆయన ఓ ప్రకటన ఇచ్చారు.


దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు  తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నందమూరి బాలకృష్ణ  తెలిపారు. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానని నందమూరి బాలకృష్ణ  అన్నారు. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదన్న నందమూరి బాలకృష్ణ.. దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని .. అంతేకానీ సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అని వివరణ ఇచ్చారు.


దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారని.. నా వాళ్లను నేను బాధ పెట్టుకుంటానా అని నందమూరి బాలకృష్ణ  అంటున్నారు. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నానని.. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నానని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: