దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 71 వేల మంది అభ్యర్థులకు ఇటీవల నియామక పత్రాలను అందజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోజ్ గార్ మేళాను వర్చువల్ గా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. సికింద్రాబాద్ లోని స్వామి వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు అందజేశారు. ఇలా ఏటా కేంద్రంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి. వాటిపై దృష్టి సారిస్తే మంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

ఎనిమిదేండ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి, స్వావలంబన సాధించింది. ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా, అటల్ ల్యాబ్స్, కౌశల్ యోజన వంటి కార్యక్రమాల ద్వారా యువత, మహిళలకు సాధికారత కల్పిస్తోంది. 2014కు ముందు 98 శాతం మొబైల్ ఫోన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేవి. ఈ రోజు 50 వేల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్నారు. వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: