తెలంగాణ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ వచ్చేసింది. గతంలో నిర్ణయించినట్లుగానే వచ్చే నెల మూడో తేదీ నుంచి ఉభయసభలను సమావేశపరుస్తూ నోటిఫికేషన్ జారీ చేసినా.. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉండాలన్న నిర్ణయానికి అనుగుణంగా శాసనసభ, మండలి సమావేశాలకు గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలా 10 నిమిషాలకు అసెంబ్లీ హాల్ లో ఉభయసభల ఉమ్మడి సమావేశం జరుగుతుంది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆ రోజు ప్రసంగిస్తారు. కొత్త సమావేశాలుగా కాకుండా గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ మారు కూడా ఉభయసభలు సమావేశం కానున్నాయని... దీంతో ప్రోరోగ్ చేయకుండానే తాజాగా సమనింగ్ నోటిఫికేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఎనిమిదో సెషన్ కు సంబంధించిన నాలుగో విడతగా అసెంబ్లీ సమావేశం కానుందని..  18వ సెషన్ కు సంబంధించిన నాలుగో విడతగా కౌన్సిల్ సమావేశం కానుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: