గతంలో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. సాంప్రదాయ డబుల్ డెక్కర్ బస్సులను నిజాం కాలంలో ప్రారంబించారు. ఇవి 2003 వరకు నగరంలో తిరిగాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీస్తున్నాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ఈ నెల 11వ తేదీన ట్యాంక్ బండ్ చుట్టూ తిరగనున్నాయి. ఫార్ములా ఈ-ప్రిక్స్‌ లో భాగంగా.. ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్‌లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరగబోతున్నాయి.


ఈనెల 11 తేదీ తర్వాత హైదరాబాద్ నగరానికి పర్యాటకాన్ని పెంపొందించడానికి బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఈ బస్సులు ఉపయోగించనున్నారు. హెచ్ఎండీఏ ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపింది. అందులో మూడు బస్సులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన మూడు బస్సులు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు మరో అట్రాక్షన్ కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: