ఏపీలో కానిస్టేబుల్ నియమాకాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ నిమాయకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వదంతులు వస్తున్నాయి. కొందరు తాము ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేసి వంచిస్తున్నారు. అయితే..  కానిస్టేబుల్ అభ్యర్థులు అపోహలకు గురికావద్దని హోంమంత్రి తానేటి వనిత  హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని హోంమంత్రి తానేటి వనిత చెబుతున్నారు.


6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్న హోంమంత్రి తానేటి వనిత.. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా, సజావుగా జరిగాయని అన్నారు. అభ్యర్థులు వారి ప్రతిభ, తెలివితేటలు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగం పొందుతారని హోంమంత్రి తానేటి వనిత  స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మి మోసపోవద్దని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు. అయితే.. ఉట్టి మాటలతో కాకుండా.. ఇలాంటి వారికి గట్టి జవాబు చెప్పాలి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే వారికి బిగ్ షాక్ ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: