తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ చరిత్ర సృష్టించారు. సీఎం కంటే ఎక్కువ సేపు ప్రసంగించి సంచలనం సృష్టించారు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. చివరి రోజు స్పీకర్ అన్ని లెక్కలు చెప్పడం ఆనవాయితీ. ఈ లెక్కల ప్రకారం.. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన సమయం 2.31 గంటలుగా ఉంది. అయితే.. మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగించిన సమయం 5.20 గంటలుగా ఉండటం విశేషం.

ఇక మిగిలిన వారి విషయానికి వస్తే.. కాంగ్రెస్ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించిన సమయం 3.14 గంటలు ప్రసంగించారు. ముఖ్యమంత్రి, మంత్రులు తీసుకున్న సమయం 30.43 గంటలుగా తేలింది. భారాస తీసుకున్న సమయం 11.05 గంటలుగా తేలింది. మజ్లిస్ తీసుకున్న సమయం 6.04 గంటలుగా లెక్క తీశారు. కాంగ్రెస్ తీసుకున్న సమయం 5.46 గంటలు కాగా.. భాజపా తీసుకున్న సమయం 2.33 గంటలుగా తేల్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: