పాకిస్థాన్‌కు తన మిత్ర దేశం చైనా బిగ్ షాక్ ఇచ్చింది. పాక్‌లోని తన కాన్సులర్‌ కార్యాలయాన్ని చైనా మూసివేసింది. అయితే..  సాంకేతిక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా  ప్రకటించింది. పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నందు వల్ల అప్రమత్తంగా ఉండాలని చైనా తమ పౌరులను హెచ్చరించింది. అలా జరిగిన కొన్నిరోజులకే చైనా తన కాన్సులర్‌ కార్యాలయాన్ని తాజాగా మూసి వేసింది.

చైనా తన వెబ్‌సైట్ ద్వారా చైనా రాయబార కార్యాలయం దీనిపై ఓ ప్రకటన చేసింది. సాంకేతిక సమస్యకు సంబంధించిన కచ్చితమైన సమాచారం చైనా ఇవ్వలేదు. అంతే కాకుండా ఎన్నిరోజులు మూసివేస్తారన్నది కూడా చైనా వెల్లడించలేదు. సాంకేతిక సమస్యల కారణంగా ఇస్లామాబాద్‌లోని చైనా కాన్సులర్‌ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మాత్రం ఈనెల 13న ప్రకటన విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని చైనా చెబుతోంది. పాకిస్థాన్‌ తాలిబన్‌ ఉగ్రవాదులు-ప్రభుత్వం మధ్య రాజీ కుదరలేదు. దీంతో .గతేడాది చివరి  నుంచి ఉగ్రదాడులు పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే  చైనా కాన్సులర్‌ కార్యాలయాన్ని మూసివేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: