బీబీసీ ఇండియాపై ఐటీ దాడుల అంశంలో మోదీ సర్కారుకు ప్రపంచ వ్యాప్తంగా నిరసన ఎదురవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ ప్రాముఖ్యానికి తాము మద్దతు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మానవహక్కుల ప్రాముఖ్యతను చాటుతూనే ఉంటామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పడం ఒక విధంగా మోదీ సర్కారుకు షాకింగ్ అనే చెప్పాలి.

మీడియా స్వేచ్ఛ వంటి సార్వత్రిక హక్కులు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి పునాది అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ చెప్పారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ముంబయి, దిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సర్వే చేపట్టిన మరుసటి రోజే అమెరికా ఇలా స్పందించింది. ఈ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదా విలువలకు వ్యతిరేకమా అని మీడియా అడిగితే.. తాను ఏమీ చెప్పలేనని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ సమాధానం ఇచ్చినా.. ఈ సోదాలకు సంబంధించిన వాస్తవాలు అమెరికాకు తెలుసన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: