2024లో కాంగ్రెస్ అధికారం ఇస్తే బంపర్ ఆఫర్ ఇస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.


అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అసద్ ఓటేయమని ప్రజలను అడగడం బాగానే ఉంది కాని కేసీఆర్ ను మోదీ ముందు మోకరిల్లోద్దని ఎందుకు చెప్పడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మోదీని వ్యతిరేకిస్తున్న మా వైపు ఎందుకో రావట్లేదని.. మాట తప్పక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: