వ్యవసాయ అనుబంధ కీలక పాడి, మత్స్య, కోళ్ల పరిశ్రమ రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఆహార, పౌష్టికాహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న యానిమల్, మత్స్య, పాడి రంగాల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా... ప్రభుత్వం ఉద్యోగం అంటూ చూడకుండా సొంతంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులుగా ఎదిగి మరో పదికి ఉపాధి అకాశాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిన నేపథ్యంలో ఎనిమిదిన్నర ఏళ్ల కాలంలో పీవీ నరసింహారావు పశు, విజ్ఞాన విశ్వవిద్యాలయం విద్యా, పరిశోధన, విస్తరణలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించింది. కోవిడ్-19 నేపథ్యంలో ఆయా రంగాల అత్యంత ప్రాధాన్యత, సత్తా చూశామని హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన పీవీ నరసింహారావు పశు, విజ్ఞాన విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవంకు గవర్నర్ వర్చువల్‌గా ముఖ్య అతిధిగా హాజరై తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: