దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 6 వ రోజు కూడా లాభాల్లో కొనసాగాయి. ముఖ్యంగా ఐటీ రంగం, ఫార్మా రంగం షేర్లు హావ కొనసాగించడంతో నేడు కూడా భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ లు లాభాల వైపు దూసుక వెళ్ళాయి. ఇక నేడు సెన్సెక్స్ ఒక్కసారిగా 40వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇకపోతే నేడు మార్కెట్ సమయం ముగిసే సమయానికి సెన్సెక్స్ 370 పాయింట్లు బలపడి 40 183 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 96 పాయింట్లు లాభపడి 11 835 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు కూడా మొదటి నుంచి ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడంతో వరుసగా 6 వ రోజు కూడా భారతీయ స్టాక్ మార్కెట్స్ లాభాల వైపు నడిచాయి.


ఇక నేడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే ముందుగా అత్యధికంగా లాభాల పొందిన కంపెనీ షేర్లు వివరాలు చూస్తే... విప్రో, సిప్లా, టిసిఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్ లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇందులో విప్రో 7.2 శాతం లాభపడింది. ఇక నష్టాల విషయం చూస్తే గెయిల్, ఓ ఎన్ జిసి, ఐటిసి, ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇక నేడు గెయిల్ అత్యధికంగా 2.9 శాతం పైగా నష్టపోయింది.



ఇక నేడు నగదు విభాగంలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు 1094 కోట్ల విలువైన కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ 1129 కోట్ల షేర్లు అమ్మకాలు చేశారు. ఇక హైదరాబాద్లో నేడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50 రూపాయలు తగ్గి 52 360 రూపాయల వద్ద, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కూడా 50 రూపాయలు నష్టపోయి 48 వేల వద్ద ముగిసింది. ఇక వెండి ధర కిలోకు 800 రూపాయలు పెరిగి 61వేల వద్ద ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: