రతన్ టాటా : రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది బిజినెస్ మ్యాన్ లకి ఇన్స్పిరేషన్.. ఇండియాకి ఫ్రీడమ్ రాక ముందే 1868 వ సంవత్సరంలో ప్రారంభించిన టాటా గ్రూపును ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన రతన్ టాటా దాన గుణాన్ని దేశ ప్రజలు కొనియాడుతూ ఉంటారు.నేటితో టాటాకు సరిగ్గా 85 సంవత్సరాలు నిండుతాయి.రతన్ టాటా 1937 డిసెంబర్ 28 వ తేదీ న ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి పేరు నావల్ టాటా.తల్లి పేరు సూని టాటా. ఆయన 1959లో కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్ ఇంకా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. 1991 వ సంవత్సరంలో రతన్ టాటాకు మొత్తం టాటా గ్రూప్‌కు నాయకత్వం వహించే అవకాశం దక్కింది.రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ తన వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా బాగా విస్తరించింది.రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.ఆయన ఎంతో ఉదారమైన వ్యక్తి. 


చాలా మంది ప్రజలకు ఆయన ఆదర్శం ఇంకా స్ఫూర్తికి మూలం. వారు తమ గ్రూప్ తో సంబంధం ఉన్న ప్రతి చిన్న ఉద్యోగిని కూడా తమ ఫ్యామిలీగా భావిస్తారు.తమ ఉద్యోగులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.ఇంకా జంతువులంటే టాటాకు ఎంతో ఇష్టం.అందులో కూడా వీధి కుక్కలంటే టాటాకు ఎంతో అమితమైన ప్రేమ. అందుకే ఆయన  NGOలు ఇంకా జంతు సంరక్షణ కేంద్రాలకు కూడా విరాళాలు ఇచ్చారు.ఇంకా ఇది కాకుండా ముంబై 26/11 దాడి అలాగే కరోనా మహమ్మారి ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సహాయం చేయడానికి రతన్ టాటా ముందుకు వచ్చి తన దాన గుణాన్ని చాటుకున్నారు.ఇక రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మరోసారి బాగా పెరిగింది. రతన్ టాటా వ్యక్తిత్వం వల్ల ఆయనను అందరూ కూడా ఎంతో ఆదర్శంగా భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: