ఎటువంటి లోపం లేని కాంతివంత‌మైన, అందమైన చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. అంద‌రూ కోరుకుంటారు. కాని, మ‌న కోరిక‌లు భిన్నంగా ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటాం. ఇక సహజంగా వాతావరణంలో మార్పులతో పాటు చర్మంలో మార్పులు వస్తుంటాయి. చలికి చర్మం పగుళ్ళు ఏర్పడుతుంది. అదే ఎండకాలంలో చర్మం టానింగ్ కు గురి అవుతుంది. టానింగ్ క్రమంగా నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమలు, ఇన్ఫెక్షన్స్ మొదలైన అనేకరకాల చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. 

 

అయితే ఇటువంటి టానింగ్ స్కిన్ ను నివారించుకోవడానికి కోన్ని సూప‌ర్ ఎఫెక్టివ్ హో రెమెడీ కూడా ఉన్నాయి. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. టొమాటొ రసానికి, నిమ్మరసం మ‌రియు పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో.. ముఖానికి, మెడకు అప్లై చేసి.. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే..మంచి ఫలితం ఉంటుంది. శ‌న‌గ‌పిండి మ‌రియు రోజ్‌వాట‌ర్ క‌లిపి ఫేస్ ఫ్యాక్ వేసుకోవాలి. శ‌న‌గ‌పిండి మ‌రియు రోజ్‌వాట‌ర్ టానింగ్ సమస్యను తీసివేయడంలో సహాయపడుతుంది.

 

అంతేకాకుండా చర్మపు సున్నితత్వం, మొటిమలు, పిగ్మేంటేషన్ వంటి అనేక ఇతర సమస్యలను సైతం పరిష్కరిస్తుంది. పాల‌లో నిమ్మ‌ర‌సం వేసి.. ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లే చేయాలి. కాసేపు ఆరినిచ్చి గోరువెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. గంధం పొడిని పాలతో కలిపి వారానికి మూడు సార్లు ముఖానికి రాసుకుంటే టానింగ్ తొలిగి చ‌ర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అదే జిడ్డు చర్మతత్వం ఉన్న వాళ్ళు గులాబీనీటిలో కలిపి వాడుకోవచ్చు.

 
 
 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: