తొక్కే కదా అని తీసి పడేస్తే.. కిందకు పడుతారు మరి. తొక్కతో ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే ఆ లాభాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఆ లాభాలు ఏంటి అంటే.. మీ అందాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. అందాన్ని పెంచే సహజ గుణాలు ఈ అరటి తొక్కకు ఉంటాయి. అలాగే అందానికి కావాల్సిన పోషకాలు ఈ అరటి తొక్కలో ఉంటాయి. కాలుష్యం, దుమ్ము దూళి నుండి ఈ అరటి తొక్క ఫేస్ ప్యాక్ కాపాడుతుంది. 

 

అరటిపండు తొక్క, కొద్దిగా వంటసోడా, కాసిని నీళ్లు మిక్సీలో వేసి పేస్ట్ లా తయారు చేసి ఆ పేస్ట్ ని ముఖానికి పట్టించుకోని కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఉండే మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ముఖచర్మం తాజాగా, కోమలంగా తయారవుతుంది. 

 

అరటిపండు తొక్కను మెత్తగా చేసి అందులో కలబంద గుజ్జును కలిపి ఆ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు ఇట్టే తొలిగిపోతాయి. 

 

జిడ్డు చర్మం ఉన్నవారు తేనె, నిమ్మరసం, ఒక అరటి తొక్కను తీసుకుని మెత్తగా పేస్ట్ లా తయారు చేసి దాన్ని ముఖానికి రాసి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే అధిక జిడ్డు పోతుంది. 

 

పాదాల పగుళ్లు ఇబ్బంది పెడితే అరటిపండు తొక్క ముద్దలో కాస్తంత కొబ్బరినూనె కలిపి ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టిస్తే క్రమంగా పగుళ్లు తగ్గుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: