బొప్పాయి గుజ్జు, అలొవెరా జెల్‌ని ఓ గిన్నెలో మిక్స్ చేసి అందులో ఓట్స్ పౌడర్ కలపండి. ఈ పేస్ట్‌ని ముఖంపై మచ్చలకు అప్లయ్ చేసి నెమ్మదిగా మసాజ్ చేయండి. తరచూ ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గడంతోపాటు ఫేస్ గ్లో పెరుగుతుంది.బంగాళ దుంపలను బద్దలుగా కట్ చేసి ఆ ముక్కలతో మచ్చలపై రబ్ చేయాలి. బంగాళ దుంపలోని నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు ఉండడంతో మచ్చలు పోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
అలొవెరా జెల్, రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖంపై అప్లయ్ చేసి కాస్త ఆరాక నెమ్మదిగా మసాజ్ చేయాలి. వారానికి ఇలా రెండు సార్లు చేస్తే మచ్చలతోపాటు పింపుల్స్ కూడా తగ్గుముఖం పడతాయి.బాదం పప్పును కొద్ది సేపు నీటిలో నానబెట్టి అందులో పాలు మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖంపై మచ్చలకు అప్లయ్ చేయాలి. కొద్దిగా ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మచ్చలు క్రమక్రమంగా తగ్గిపోతాయి.
తొక్క తీసిన యాపిల్ పండును గుజ్జుగా చేసి అందులో ఒక్కో టేబుల్ స్పూన్ల బార్లీ పౌడర్, తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత నీటితో క్లీన్ చేసుకోవాలి. ఓ నెల రోజులపాటు డైలీ ఇలా చేస్తే ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.
అలాగే ఓ గిన్నెలో రెండు టీ స్పూన్ల నిమ్మరసం తీసుకోండి. ఇందులో కొంచెం గంధం మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మచ్చలపై అప్లయ్ చేయండి. ఓ 20 నిమిషాల పాటు ఆరిపోయాక చల్లని నీటితో క్లీన్ చేయండి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.నిమ్మ రసం, శనగ పిండి, చిక్కని పాలు కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై అప్లయ్ చేస్తే మచ్చలు తగ్గుతాయి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచిది.ఓ గిన్నెలో ఒక టీ స్పూన్ తేనె, నిమ్మరసం, కొద్దిగా మిల్క్ పౌడర్ వేసి పేస్ట్ లా చేయాలి. ఇందులో ఓ టీస్పూన్ బాదం ఆయిల్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లయ్ చేయండి. దీని వల్ల పిగ్మెంటేషన్ మచ్చలతోపాటు టానింగ్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి