ఆడవాళ్ళైనా మహావాళ్ళైనా కాని అందంగా కనిపించాలంటే మెయిన్ రెండు బాగుండాలి. ఒకటి అందమైన చర్మం రెండు మృదువైన జుట్టు. ఈ రెండు బాగుంటే చాలా అందంగా వుంటారు. ఇక ఈ రెంటికి కూడా ఆల్రౌండర్ లాగా పని చేస్తుంది బ్లాక్ సీడ్. బ్లాక్ సీడ్  చర్మానికి అలాగే జుట్టుకి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో చర్మానికి మేలు చేసే అయుర్వేద పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు అధికం మొత్తంలో ఉంటాయి. అంతేకాదు బ్లాక్ సీడ్ యాంటీయాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.కాబట్టి ఆకట్టుకునే అందం కోసం బ్లాక్ సీడ్ వాడటం ఉత్తమం.


ఇక బ్లాక్ సీడ్స్ ఆయిల్ చాలా మంచిది. దీనిని డల్ గా ఉన్న చర్మానికి వర్తించడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. అలాగే చర్మం పొడిబారడాన్ని తగ్గించి తేమను పెంచి మృదువుగా తయారు చేసి చర్మం కాంతివంతంగా మెరిసే గుణాన్ని అందిస్తుంది. ఇక చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ వుంటారు. ఇక ఇందులో ఉండే విటమిన్ ఏ కారణంగా మొటిమల సమస్య అనేది రాకుండా ఉంటుంది. అలాగే చర్మంపై మొటిమలు తగ్గాక వచ్చే నల్లని మచ్చలని కూడా ఇది పూర్తిగా నివారిస్తుంది. హార్మోన్ల అసమతుల్యం, ఎండ కారణంగా వచ్చే మచ్చలని అలాగే చెమట కాయలని కూడా దూరం చేసి చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా అలాగే అందంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.


ఇక రెండోది చాలా మంది జుట్టు రాలే సమస్యతో కూడా చాలా తీవ్రంగా బాధ పడుతూ వుంటారు. ఇక ఆ సమస్యతో బాధపడే వారు బ్లాక్ సీడ్స్ ఆయిల్ ని వాడటం అలవాటు చేసుకోండి. నెత్తిమీద బ్లాక్ సీడ్ ఆయిల్ ని బాగా పట్టించడం వల్ల జుట్టు కుదుళ్ళకు మంచి పోషణ లభించి, జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఇంకా జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది. ఈ మధ్య కాలంలో యవ్వనంలోనే జుట్టు తెల్లబడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఈ బ్లాక్ సీడ్స్ ఆయిల్ ని ఉపయోగిస్తే జుట్టు నల్లగా నిగ నిగ లాడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: