మార్చి 17వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూసి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 డివి  గుండప్ప జననం : ప్రముఖ కన్నడ కవి పద్మభూషణ్ అవార్డు గ్రహీత, డివీజీ గా ప్రసిద్ధి చెందిన దేవనహళ్లి వెంకటరమణయ్య గుండప్ప 1887 మార్చి 17వ తేదీన జన్మించారు. ఈయన కన్నడ కవి మరియు రచయిత తత్వవేత్త. ఇతని సుప్రసిద్ధమైన రచన మంకు తిమ్మన్న కగ్గ... మధ్య యుగానికి చెందిన కన్నడ కవి సర్వజ్ఞాని వచనాలను పోలి ఉంటాయి.ఈయన  కన్నడ భాషలో ఎన్నో సుప్రసిద్ధమైన రచనలను రచించారు. 

 

 

 రాయప్రోలు సుబ్బారావు జననం : నవ్య కవిత పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు తెలుగులో భావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో రాసిన తృణకంకణము తో తెలుగు కవిత్వంలో నూతన శకం ఆరంభమైంది అని అంటూ ఉంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించారు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతి  యువకులకు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తంతో ఖండకావ్య  ప్రక్రియకు అంకురార్పణ చేశారు రాయప్రోలు సుబ్బారావు. కళాకారుని ఊహలు భావాలు సృజనాత్మకతకు ప్రాధాన్యమిచ్చే కళారూపం భావుకత. మన సమాజానికి అనుగుణంగా బావు  కథను అల్లి తెలుగు కవితకు కొత్త సొగసులు అద్దారు రాయప్రోలు సుబ్బారావు. ఈయన గొప్ప జాతీయవాది.. తెలుగు జాతి అభిమాని. ఈయన  దేశభక్తి గేయాలు ఎంతో ఉత్తేజకరంగా ఉంటాయి. 

 

 

 కల్పనా చావ్లా జననం : భారతదేశానికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా 1962 మార్చి 17వ తేదీన జన్మించారు. ఈమె భారత దేశ వ్యోమగామిగా మొట్టమొదటిసారి అంతరిక్షంలో కాలుమోపిన  మహిళగా రికార్డు సృష్టించారు. చిన్నప్పటి నుంచే విమానాల తయారీ పై ఆసక్తి కనబరిచిన ఈమె  పేదరికం లోనూ కష్టాలను అధిగమించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసి నాసాలో స్థానం సంపాదించారు. ఇక ఆ తర్వాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో ముఖ్య వ్యోమగామిగా పేరుగాంచారు. భారత ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా పాకిపోయేలా చేశారు. ఇక 2003 సంవత్సరంలో ఈమె ఆర్బిటర్ ద్వారా అంతరిక్షం లోకి ప్రవేశించి ఏకంగా 31 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. ఇక ఆ తర్వాత ఆర్బిటర్ లో భూమిపైకి తిరిగి వస్తున్న సమయంలో... ఆర్బిటర్ ఒక్కసారిగా పేలుడు కు గురి కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కల్పనా చావ్లా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. 

 

 

 సైనా నెహ్వాల్ జననం : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన సైనానెహ్వాల్ 1990 మార్చి 17వ తేదీన జన్మించారు. ఒలంపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ ట్రోపీ సాధించిన తొలి మహిళ సైన నెహ్వాల్ . భారత మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ ఆమెకు శిక్షకుడిగా ఉండేవాడు. ఇక సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ ను  నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిల్ ను  సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. 2006లో ఫిలిప్పీన్స్ లో  ఓపెన్ బ్యాడ్మింటన్ గెలిచిన  తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించడంతో సైనా నెహ్వాల్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా సైనానెహ్వాల్ ఖాతాలో ఎన్నో విజయాలు ట్రోపీలు కూడా ఉన్నాయి. 

 

 

 పెద్ది రామారావు జననం : తెలుగు నాటక రంగ ప్రముఖులు, తెలుగు కథా రచయిత అయిన పెద్ది రామారావు  1973 మార్చి 17వ తేదీన జన్మించారు. ఈయన  దూరదర్శన్లో చిరకాలంగా ప్రసారమైన మెగా డైలీ సీరియల్ ఋతురాగాలాలకు  మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తెలుగు నాటకాన్ని సుసంపన్నం చేయడానికి ఆయన తన యవనిక పత్రికను నడిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: