ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం డి.జె.పురంలో దారుణం చోటుచేసుకుంది. అల్లుడు తల నరికి చంపాడు మామ పల్లా సత్యనారాయణ.అల్లుడు తలను సంచిలో వేసుకుని అన్నవరం పీఎస్కు తీసుకెళ్లాడు. సత్యనారాయణ కుమార్తె గతేడాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పటి నుంచి సత్యనారాయణతోనే ఇద్దరు మనవరాళ్లు ఉంటున్నారు. నిన్న రాత్రి అత్తారింటికి అల్లుడు వచ్చాడు. మీ కుమార్తెను నేనే చంపానని మద్యం మత్తులో మామతో చెప్పాడు. ఉదయం అల్లుడు తల నరికి మనవరాళ్లతో సహా అన్నవరం పీఎస్కు వెళ్లాడు సత్యనారాయణ.