తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 253 కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల తర్వత రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో కరోనా బాధితుల సంఖ్య 4,737కు చేరింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 2,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,352 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 179 కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో 8 మంది కరోనా భారీన పడి మృతి చెందటంతో కరోనా మృతుల సంఖ్య 182కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: