తెలంగాణ సర్కార్ కరోనా పరీక్ష ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల ధరను రూ. 2,200గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనాపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వెంటిలేటర్‌ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ. 7000, వెంటిలేటర్‌ మీద చికిత్స అందిస్తే రూ. 9000 చెల్లించేలా ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. సాధారణ ఐసోలేషన్‌లో రోజుకు ధరను రూ.4500గా నిర్ణయిస్తున్నట్టు ప్రకటన చేసింది. 
 
సోమవారం వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మీడియా సమావేశం ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. ఐసీఎంఆర్‌ నిబంధనలకు లోబడే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: