జమ్మూ & కాశ్మీర్ కతువాలోని పన్సార్‌లో ఉదయం 5:10 గంటలకు పాకిస్తాన్ గూడచారి డ్రోన్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) సిబ్బంది పేల్చి వేసారు. జమ్మూ & కాశ్మీర్ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో సరిహద్దుల్లో భారత బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. తాజాగా సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సిబ్బంది కాల్చివేసిన పాకిస్తాన్ డ్రోన్ నుంచి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 

 

ఇక గత కొన్ని రోజుల నుంచి కూడా  పాక్ డ్రోన్ లు భారత భూభాగం లో తిరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు ఆయుధాలను అందించడానికి గానూ ఈ విధంగా డ్రోన్ లను పాకిస్తాన్ వినియోగిస్తుంది అని పలువురు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: