ఏపిలో ఈ మద్య వరుసగా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 14,414 కాగా, ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 8,082 మంది ఏపీ వాసులు చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 6,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 206కి చేరింది. ఇప్పుడు కరోనా ప్రజాప్రతినిధులకు కూడా సోకుతుంది. తెలంగాణలో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, వారి గన్ మేన్స్, డ్రైవర్లకు కరోనా పాజిటీవ్ తేలింది.

 

ఇక ఏపిలో కూడా పలువురు ప్రతినిధులకు కరోనా పాజిటీవ్ అని తేలిన విషయం తెలిసిందే. తాజాగా  బీజేపీ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెల్ఫీ వీడియో ద్వారా ఆయనే స్వయంగా వెల్లడించారు. సామాజిక దూరం పాటించకుండా ఉంటేనే కరోనా వస్తోందన్నారు.

 

వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. భయపడి టెస్టులు చేయించుకోవడం మానొద్దని పైడికొండల మాణిక్యాలరావు సూచించారు. అంతే కాదు కరోనా వచ్చిందని భయపడవద్దని.. అది రాకూడని రోగం కాదని.. ప్రమాదకారి కాదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: