ఈ మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  కాస్త రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతీసారి కూడా ఆయన కాస్త అధికార విపక్షాలను టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో వందల‌ కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులని ప్రజల్లోకి తీసుకువెళుతాం అని అన్నారు.

 మేము చేపట్టిన అభివృద్దిలో వైసీపీ, టీడీపీకి సంబంధం లేదు అని సోము వీర్రాజు  స్పష్టం చేసారు. చంద్రబాబు అమరావతిలో రూ.7200 కోట్లు ఖర్చు పెడితే భ్రమరావతిగా మారిపోయింది అని ఆయన అన్నారు. చంద్రబాబు వల్లే 2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ లో ఓటు శాతం పడిపోయింది అని ఆయన విమర్శలు చేసారు. కేంద్రం గ్రామీణాభివృద్ధి కింద వైసీపీకి రూ.20వేల కోట్లు ఇచ్చింది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: