ఆంధ్రుడు స‌గ‌ర్వంగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిరసిస్తూ కొన‌సాగుతోన్న ఉద్య‌మం రోజు రోజుకు ఉధృతం అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ఈ రోజు రాష్ట్రం అంత‌టా బంద్ కొన‌సాగిస్తున్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హ‌క్కు అనే నినాదంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్త బంద్‌కు కార్మికులు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో బస్సు ఆర్టీసీ బస్టాండ్‌కే పరిమితమయ్యాయి.

బంద్‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన టీడీపీతో పాటు వామ‌ప‌క్ష పార్టీలు కూడా మ‌త మ‌ద్ద‌తు తెలిపాయి. బంద్ సంద‌ర్భంగా కళాశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బ‌స్సుల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం చిన్న ట్విస్ట్ ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుండి బస్సులు రోడ్డెక్కనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: